లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
BHNG: జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలోని మహామండపంలో స్వామివారిని, అమ్మవారిని కొత్త వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద మంత్రాల మధ్య కళ్యాణ తంతును చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని తెలిపారు.