కోనో కార్పస్ మొక్కలు తొలగించాలని వినతి

KNR: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో నాటిన కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని సామాజిక కార్యకర్త అన్నమల్ల సురేష్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌కు దరఖాస్తు అందజేశారు. నగరంలో ఇప్పటివరకు హరితహారం కార్యక్రమం మొదలు కాలేదని, ఈ విషయమై తగిన చర్యలు చేపట్టాలని సురేష్ వినతిలో కోరారు.