గచ్చిబౌలిలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
HYD: గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్ ఫామ్ హౌస్‌పై ఎస్‌వోటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. రహస్యంగా గంజాయి సాగు చేస్తున్న యూపీకి చెందిన వాచ్‌మెన్ మాతా బాదల్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 272 గ్రాముల గంజాయి మొక్క, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఎన్డీపీఎస్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.