రేపు చేప పిల్లలను విడుదల చేయనున్న ఎమ్మెల్యే
మెదక్ మండలం కొంటూర్ గ్రామంలోని పెద్ద చెరువులో రేపు ఉదయం 11 గంటలకు 100% సబ్సిడీ చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. చేప పిల్లలు విడుదల కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు వివరించారు.