రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
అన్నమయ్య: మదనపల్లిలో రేపు ఉదయం 10 గంటల నుంచి PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని, సమాచారం కోసం 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలతో ఉన్నవారు మాత్రమే జిల్లా కేంద్రానికి రావాలని ఆయన సూచించారు.