నేటి నుంచి 3వ విడత నామినేషన్లు
మెదక్ జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కొల్చారం, కౌడిపల్లి, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లోని 183 సర్పంచ్, 1,523 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు.