చెరువులను తలపిస్తున్న రహదారులు

GNTR: గత రాత్రి కురిసిన భారీ వర్షానికి గుంటూరులోని పలు ప్రాంతాలు గురువారం జలమయం అయ్యాయి. వర్షపు నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా నగరపాలెం, మస్తానయ్య దర్గా వద్ద వర్షపు నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, నీటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.