బ్రిటీష్ పాలకులను వణికించిన 18 ఏళ్ల కుర్రాడు
స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు ఖుదీరాం బోస్ జయంతి నేడు. 18 ఏళ్ల వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన ధీరుడు అతడు.. మృత్యువు ఎదురుగా ఉన్నా.. భగవద్గీతను చేతిలో పట్టుకుని 'వందేమాతరం' నినాదంతో ఉరికంభం ఎక్కిన ఆ తెగువ చూసి బ్రిటిష్ పాలకులు వణికిపోయారు. స్వేచ్ఛా వాయువుల కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఆ విప్లవ కిరణం.. నేటి యువతకు ఎప్పటికీ ఆదర్శం.