'పెనుకొండలో భక్తులకు సౌకర్యాలు కల్పించండి'
సత్యసాయి: పెనుకొండలో బాబాఫకృద్దీన్ ఉరుసులో మౌలిక సదుపాయాలు కల్పించాలని అనంతపురం బహుజన ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెస్ ఆదినారాయణ డిమాండ్ చేశారు. బుధవారం పెనుకొండలో ఆయన మాట్లాడుతూ.. దర్గా సమీపంలో చెత్త చెదారం పేరుకుపోయిందని, దీనివల్ల దర్గాకు వెళ్ళే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భక్తులకు వాష్ రూమ్స్, స్నానపు గదులు కల్పించాలని కోరారు.