నిజాయితీ చాటుకున్న పాత్రికేయుడు
KRNL: పోగొట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అందజేసి పాత్రికేయుడు శ్రీధర్ స్వామి తన నిజాయితీని చాటుకున్నారు. మంత్రాలయం ఎస్సై శివాంజల్ తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ సోమవారం రాత్రి రాఘవేంద్ర స్వామి మఠం మధ్వ కారిడార్లో మొబైల్ పోగొట్టుకున్నాడు. ఆ ఫోన్ శ్రీధర్ స్వామికి దొరికింది. దీన్ని పోలీసులకు అందజేయగా మంగళవారం శ్రీనివాస్‌కు అందజేశారు.