ఏడాది కిందట ఆదేశాలు.. నేడు నీటి కష్టాలు

ఏడాది కిందట ఆదేశాలు.. నేడు నీటి కష్టాలు

నిర్మల్ జిల్లాలో ఎండలు ముదురుతున్నా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట ఏప్రిల్ 1న తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని జిల్లా యంత్రాంగం ఆదేశించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందిన్నారు. మాడెగాం శుద్ధి కేంద్రంలో మరమ్మతుల సాకుతో గత మూడు రోజులుగా సుమారు 700 గ్రామాలకు నీరు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు.