టెన్త్ విద్యార్థులకు ఎంపీ శుభాకాంక్షలు
KRNL: రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో కర్నూలు జిల్లా విద్యార్థులకు MP నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల పట్ల భయపడకుండా ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకుని ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలని తెలిపారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.