విశేష అలంకరణలో వన దుర్గమ్మ
MDK: భక్తుల కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతున్న ఏడుపాయల వన దుర్గామాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం వేకువజామున ఆలయ అర్చకుడు రావికోటి పార్థివ శర్మ అమ్మవారికి మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, సహస్రనామార్చన, కుంకుమార్చన పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.