షహీద్ దివస్.. ప్రధాని మోదీ నివాళులు
షహీద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు PM మోదీ నివాళులర్పించారు. చిన్న వయసులోనే దేశం కోసం వారు చూపిన ధైర్యం, నిబద్ధత అన్ని తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనపై పోరాటంలో భాగంగా అధికారి JP శాండర్స్‌ను హత్య చేయడం, పార్లమెంటులో బాంబులు వేసినందుకు ఈ ముగ్గురినీ ఉరితీశారు. వారి బలిదానానికి గుర్తుకు ఏటా షహీద్ దివస్ జరుపుకుంటారు.