మహిళలు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను పెంచుకోవాలి: ఏపిఎం ప్రసాద్

KMR: సదాశివ్ నగర్ స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను పెంచుకోవాలని ఏపిఎం ప్రసాద్ అన్నారు. లింగంపల్లి గ్రామంలో గురువారం బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల రికవరీ చేపట్టారు. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తే రెట్టింపు రుణాలు ఇస్తామని తెలిపారు. సమన్వయకర్తలు రాములు, నరేందర్, అంజయ్య పాల్గొన్నారు.