నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
విజయనగరం జిల్లాలోని మెరకముడిదాంలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్కో ఏఈ త్రినాథ రావు తెలిపారు. 11 కేవీ ఊటపల్లి ఫీడర్, గర్భాం సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ భైరిపురం ఫీడర్‌లో లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలన్నారు.