ఆ రూల్స్‌తో సినిమా తీయలేం: బేబీ నిర్మాత

టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బేబీ నిర్మాత SKN ట్వీట్ చేశారు. '50ఏళ్ల కిందటి యూనియన్ రూల్స్‌తో నేటి పరిస్థితుల్లో నిర్మాతలు మూవీలు తీయలేరు. వేతనాల పెంపు సమస్య ముగింపు కోసం నిర్మాతలు కృషి చేస్తున్నారు. ఈ ఏడాది 10%, 2026 నుంచి రెండేళ్ల పాటు 5% పెంచుతామని వారు చెబుతున్నారు. పలు కారణాలతో నిర్మాతలకు మూవీల నుంచి తగిన ఆదాయం రావడం లేదు' అని పేర్కొన్నారు.