VIDEO: తోటలు దగ్ధం.. రూ. 8 లక్షల నష్టం

VIDEO: తోటలు దగ్ధం.. రూ. 8 లక్షల నష్టం

MLG: గోవిందరావుపేట మండలం రాంనగర్ తండాలో భూక్య మోహన్ రాథోడ్‌కు చెందిన 3 ఎకరాల పామాయిల్, పక్కనే ఉన్న 15 ఎకరాల జామాయిల్ తోటలు మంటల్లో కాలిపోయాయి. శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రైతులు ఆర్పేందుకు ప్రయత్నించినా భారీ నష్టం జరిగింది. చెట్లు పూర్తిగా దగ్ధమై రైతు సుమారు రూ. 8 లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు. రైతు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు