రేపు 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం'

ADB: వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం 'గురువారం పట్నాపూర్ రైతు వేదికలో నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రమేశ్ తెలిపారు. ఉదయం 8:45 గంటలకు కార్య క్రమం ప్రారంభం కానుందని, రైతులందరూ పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.