VIDEO: నరసన్నపేటలో పందుల స్వైర విహారం

SKLM: నరసన్నపేట గాంధీనగర్ నాలుగు వీధులలో,ఇందిరానగర్ ప్రాంతంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో దుర్వాసన దోమల వ్యాప్తి అధికంగా ఉందని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.