సమాజంలో ఇంజినీర్ల పాత్ర అనిర్వచనీయం: ఎమ్మెల్యే

PLD: సమాజంలో ఇంజినీర్ల పాత్ర అనిర్వచనీయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం అలుగురాజుపల్లి గ్రామంలో గల ఓ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.