ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
తిరుపతి: మామండూరు వద్ద వాహన తనిఖీల్లో 8 ఎర్రచందనం దుంగలతో సహా ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు ఆదేశాలతో SP శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించారు. అనంతరం వారిని టాస్క్ ఫోర్స్ స్టేషన్‌కు తరలించారు. ప్రకృతి బాట వద్ద మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో స్మగ్లింగ్‌కు ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు.