IND vs AUS: ముగిసిన పవర్ ప్లే.. 2 వికెట్లు డౌన్

IND vs AUS: ముగిసిన పవర్ ప్లే.. 2 వికెట్లు డౌన్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో 187 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ దీటుగా బదులిస్తోంది. పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (25), శుభ్‌మన్ గిల్ (15) ఔట్ అయ్యారు. ప్రస్తుతం సూర్యకుమార్ (19), తిలక్ వర్మ (2) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 123 పరుగులు చేయాల్సి ఉంది.