పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
VZM: స్థానిక జెఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఏపీపీఎస్‌సీ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రామసుందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఎండోమెంట్ ఆఫీసర్ తదితర ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.