కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకోండి: ఎమ్మార్వో

NLR: కొత్త రైస్ కార్డు కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మార్వో లక్ష్మీనారాయణ గురువారం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రైస్ కార్డు కోసం ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రైస్ కార్డులో కొత్తవారిని నమోదు చేయడం, తొలగించడం, ఇంకేమైనా రైస్ కార్డులో సవరణలు, మీ పరిధిలోని సచివాలయాన్ని సంప్రదించాలన్నారు.