VIDEO: తిరగబడ్డ ట్రాక్టర్.. తప్పిన ప్రమాదం

VIDEO: తిరగబడ్డ ట్రాక్టర్.. తప్పిన ప్రమాదం

కోనసీమ: జొన్నాడ వైపు వెళ్లే ఏటిగట్టు రోడ్డుపై గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ గోతిలో పడి గురువారం అదుపుతప్పి తిరగబడింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. రోడ్డు అధ్వానంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. విద్యార్థులు, కూలీలు నిత్యం ప్రయాణించే ఈ రహదారికి వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.