గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

తూ.గో జిల్లా రాజమహేంద్రవరం గోదావరి బండ సమీపంలోని ధోబి ఘాట్ వద్ద గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 45 నుంచి 50 వరకు ఉండవచ్చని, మృతదేహంపై గ్రీన్ కలర్ టీ షర్ట్, గల్ల లుంగి ధరించి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.