PACS కమిటీ ఛైర్మన్, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకారం

కృష్ణా: పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామంలో PACS కమిటీ ఛైర్మన్, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. పామర్రు MLA వర్ల కుమార్ రాజా పాల్గొని వారితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. గతంలో పార్టీ కార్యాలయంలో అందించేవారు అని ఇప్పుడు లబ్ధిదారులు ఇళ్ళకి వెళ్లి అందిస్తున్నామని పేర్కొన్నారు.