తప్పిపోయిన బాలుడు.. పోలీస్ స్టేషన్‌లో సురక్షితం

తప్పిపోయిన బాలుడు..  పోలీస్ స్టేషన్‌లో సురక్షితం

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో ఆదివారం మొహమ్మద్ నుమాన్ అనే చిన్న బాలుడు తప్పిపోయాడు. అతని తండ్రి పేరు కమల్ బాషా అని బాలుడు చెబుతున్నాడు. స్థానికులు బాలుడిని గుర్తించి రాయచోటి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. బాలుడిని లేదా అతని కుటుంబాన్ని తెలిసినవారు రాయచోటి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి, బాలుడిని తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు.