పట్టణంలో చోరీ కలకలం

పట్టణంలో చోరీ కలకలం

MBNR: జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో చోరీ జరిగింది. రోడ్ నం. 7లో నివసించే మహమ్మద్ షేక్ వలి కుటుంబం శుభకార్యానికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి తాళాలు, బీరువాలను పగులగొట్టి రెండు తులాల బంగారం, రూ. 10 వేల నగదును అపహరించారు. తెల్లవారుజామున ఇంటికి వచ్చిన యజమాని దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.