జిల్లాలో RYV పథకానికి 21,428 దరఖాస్తులు

BHPL: జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి 21,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకానికి సిబిల్ స్కోర్ కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. గతంలో లోన్లు తీసుకుని చెల్లించని వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. దరఖాస్తుదారుల లోన్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.