ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా ముచ్చర్ల శ్రీనివాస్
నల్గొండ పట్టణానికి చెందిన 'ది హన్స్ ఇండియా' ఫోటో జర్నలిస్టు ముచ్చర్ల శ్రీనివాస్ ఉత్తమ ఫోటో జర్నలిస్టు అవార్డు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. బెస్ట్ న్యూస్ ఫోటో క్యాప్చర్ విభాగంలో ఆయనకు ఈ గౌరవం దక్కింది.