చిట్యాలలో సోనియా జన్మదిన వేడుకలు
NLG: చిట్యాలలో సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం దేవదాసు మాట్లాడుతూ.. తెలంగాణను ఇచ్చి ప్రజలచే సోనియా "తెలంగాణ తల్లి" గా కొనియాడ బడుతున్నారని ప్రశంసించారు.