అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
MBNR: మిడ్జిల్ మండలంలో ఇవాళ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తపల్లి, బైరంపల్లి గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. ఈ పర్యటనలో ఎంపీడీ గీతాంజలి, సర్పంచులు పాల్గొన్నారు.