కోటగిరిలో భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలు

కోటగిరిలో భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలు

NZB: భారీ వర్షాలకు కోటగిరి మండలంలో వరి, సోయా, కూరగాయల పంటలు నీళ్లపాలు అయ్యాయని రైతులు వాపోతున్నారు. చాలా చోట్ల మొక్కజొన్న, వరి నేలమట్టమైంది. కూరగాయల పంటలు కూడా నీళ్లలో ఉండి కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద కారణంగా పొలాలు చెరువుల్లా తలపిస్తున్నాయన్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, పొలాలను సందర్శించి, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.