కర్నూలులో మాజీ ఆర్మీ అధికారి అరెస్టు

KRNL: తిరుమలగిరి టౌన్ షిప్‌లో నివాసముంటున్న మాజీ ఆర్మీ అధికారి నగేశ్ రావు ఇంట్లో సుమారు 53 ఆర్మీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ తెలిపారు. శనివారం జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని గుర్తించామన్నారు. బెంగళూరు ఆర్మీ క్యాంటీన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అధిక రేట్లకు అమ్ముతున్నట్లు తేలిందని పేర్కొన్నారు.