అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
కోనసీమ: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఆత్రేయపురం మండలంలోని పలు గ్రామాల్లో రూ.1.17 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.