దండేపల్లిలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

దండేపల్లిలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. గురువారం ఉదయం దండేపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి పలు గ్రామాల నుండి ఆశావాహులు తరలివచ్చి నామినేషన్లను సమర్పించారు. ఈ సందర్భంగా మండల అధికారులు నామినేషన్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల అధికారులకు సూచనలు చేస్తున్నారు.