భారత్‌పై మరోసారి పాకిస్తాన్ అక్కసు

భారత్‌పై మరోసారి పాకిస్తాన్ అక్కసు

భారత్‌పై మరోసారి పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఘర్షణల్లో తాము నిమగ్నమయ్యేలా భారత్ ప్రణాళికలు రచిస్తోందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాలం నుంచి తమపై భారత్ పరోక్ష యుద్ధం చేస్తోందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, అవసరమైతే వాటిని బయటపెడతామని అన్నారు.