'వరి కొయ్యలు కాల్చటం భూమికి రైతుకు నష్టమే'
BHNG: వరి కోతల అనంతరం మిగిలిపోయిన వరి కొయ్యలను రైతులు కాల్చటం వలన భూమిలో ఉండే సూక్ష్మ జీవులు చనిపోయి కర్బన శాతం పెంచే ప్రక్రియ తగ్గిపోతుందని యాదగిరిగుట్ట ఏడీఏ శాంతి నిర్మల రైతులకు వివరించారు. మంగళవారం బొమ్మలరామారం మండలం ధర్మారెడ్డి గూడెంలో వరి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వరి కొయ్యల కాల్చివేతపై అవగాహన కల్పించారు.