‘సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి’

‘సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి’

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SBI జీఎం రవికుమార్ వర్మ సూచించారు. సైబర్ మోసాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి SBI, RBIతో కలిసి వివిధ విద్యాసంస్థలు, మాల్స్, మెట్రో స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. సైబర్ మోసాలు జరిగినప్పుడు 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.