గోవిందా నామస్మరణతో సాగిన రథోత్సవం

గోవిందా నామస్మరణతో  సాగిన రథోత్సవం

NLR: బుచ్చి మండలం పంచేడులో వెలసి ఉన్న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి అమ్మవార్ల రథోత్సవం వేడుకగా నిర్వహించారు. అర్చకులు హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవం రమణీయంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతి నుంచి కొబ్బరికాయలు కొట్టారు.