ఇకపై 'జోహో'లోనే సర్కార్ ఈ-మెయిల్స్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రత కోసం 12.68 లక్షల అఫీషియల్ మెయిల్స్‌ను ఎన్‌ఐసీ నుంచి స్వదేశీ 'జోహో మెయిల్'కు మార్చేసింది. ఇందులో 7.45 లక్షల మంది ఉద్యోగుల ఖాతాలున్నాయి. అక్టోబర్‌లోనే ఈ ప్రాసెస్ మొదలైందని కేంద్రం పార్లమెంట్‌లో చెప్పింది. అయితే ఈ మార్పు కోసం ఎంత ఖర్చయ్యిందనేది మాత్రం వెల్లడించలేదు.