VIDEO: దోపిడీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

VIDEO: దోపిడీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

WG: ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర జిల్లాల దొంగను పెనుగొండ పోలీసులు 48 గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఇలపర్రులో అడ్రస్ అడుగుతున్నట్లు నటించి, వృద్ధురాలు బంగారమ్మ మెడలో 3 కాసుల గొలుసు లాక్కెళ్లిన ఘటనలో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు వాసంశెట్టి వీరబాబును పట్టుకున్నారు. నిందితుడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.