భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
SRCL: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సెలవు దినం కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. భీమేశ్వరాలయంలో భక్తులు కోడెల మొక్కులు చెల్లించి అన్నపూజ, అభి షేకం పూజలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిత్యాన్నదాన సత్రంపై నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు.