మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులకు శిక్ష
VZM: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులకు కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ విజయ్ చందర్ వారం రోజులు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించినట్లు సీఐ షణ్ముఖరావు సోమవారం తెలిపారు. వివరాల మేరకు కొత్తవలస కూడలిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా బలిఘట్టం, మంగళపాలెం గ్రామాలకు చెందిన వ్యక్తులు మద్యం సేవించి వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు చెప్పారు.