'మెడికల్ కాలేజీలపై వైసీపీ దుష్ప్రచారం'
BPT: మెడికల్ కాలేజీల నిర్మాణంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని రేపల్లెలో మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గతంలో మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేకపోయినవారు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీలను వేగంగా పూర్తిచేసి, పేదలకు ఉచిత వైద్యం అందించడంతోపాటు మెడికల్ సీట్లను పెంచుతోందని తెలిపారు.