'ఆలయానికి నిఘా కరువు.. రెచ్చిపోతున్న ఆకతాయిలు'
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. రాత్రి వేళలో ఈ ఆలయ పరిసరాల్లో మద్యం మత్తులో మందుబాబులు చిందులేస్తూ.. వీరంగం సృష్టిస్తున్నారు. ఈ ఆలయానికి సరైన నిఘా లేకపోవడంతో ఆకతాయిలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని భక్తులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.