బ్రిటిష్ కాలం కట్టడం… ఇప్పటికీ కూల్చడం కష్టం..!
కృష్ణా: విజయవాడ–చెన్నై రైల్వే లైన్‌లో కృష్ణా నదిపై పాత వంతెన పిల్లర్లను అధికారులు తొలగిస్తున్నారు. అయితే ఈ పాత వంతెన బ్రిటిష్ కాలం నాటి కట్టడం కావడంతో ఒక్కో పిల్లర్ కూల్చేందుకు 10-15 రోజులు పడుతోందని సిబ్బంది తెలిపారు. నూతన వంతెన ప్రతిపాదన ఉండటంతో ఇప్పుడు పాత వంతెన పిల్లర్లను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.