TARGET.. 15 వేల ఇంకుడు గుంతలు
HYDలో సాధారణ వర్షపాతం కంటే సుమారు 32% అధికంగా వర్షం పడుతున్నప్పటికీ, జనవరి నాటికే భూగర్భ జలాల కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కనీసం 15 వేల ఇంకుడు గుంతలు నిర్మించాలని జలమండలి లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, సుమారు 12 ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.